గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని హేరంబా పాఠశాలలో విద్యార్థులు పర్యావరణహితంగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయనాలతో చేసిన రంగులు వాడకుండా.. ఆకుకూరలు, క్యాబేజీ, బీట్ రూట్, వివిధ రకాల పూలతో ముగ్గులు వేశారు. విద్యార్థినులు ప్రమిదలతో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా వేసిన రంగవల్లులు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: