ఇదీ చదవండి :
'ఆంగ్ల మాధ్యమ జీవో.. తెలుగు ఉనికికే ప్రమాదం' - ఇంగ్లీషు మీడియంపై టీడీపీ కామెంట్స్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమ జీవో 81 రాజ్యాంగ విరుద్ధమని తెదేపా అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ జీవో తెలుగు ఉనికికే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
'ఆంగ్లమాధ్యమ జీవో తెలుగు ఉనికికే ప్రమాదం'
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు మాధ్యమ బోధన తొలగించి.. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 81 రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంగ్ల బోధనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు భాష ఉనికిని ప్రమాదంలోకి నెడుతుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చర్చించకుండా... భాషా నిపుణుల సూచనలు తీసుకోకుండా ఇలాంటి జీవో తేవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆంగ్ల మాధ్యమానికి తెదేపా వ్యతిరేకం కాదని... ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యమంలోనూ బోధన ఉండాలని స్పష్టం చేశారు. మాతృభాషలో బోధన జరగాలని మహాత్మా గాంధీ, అంబేడ్కర్ వంటి మహనీయులు చెప్పిన మాటలను డొక్కా గుర్తు చేశారు.
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion: