ETV Bharat / state

అమరావతి కోసం.. భువనేశ్వరి గాజులు విరాళం - nara bhuwaneswari tour in yerrabalem

అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయబోరని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా నిరంతరం ప్రజల కోసమే పరితపించారని ప్రశంసించారు. తమ కుటుంబం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

'ప్రజల తర్వాతే నన్ను కుటుంబాన్ని పట్టించుకునేవారు'

author img

By

Published : Jan 1, 2020, 2:02 PM IST

Updated : Jan 1, 2020, 4:58 PM IST

రైతులకు అండగా తమ కుటుంబం అండగా ఉంటుందన్న నారా భువనేశ్వరి

రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారని.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఏపీని ప్రథమ స్థానంలో తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఎప్పుడూ అమరావతి అభివృద్ధి కోసం పరితపించారని అన్నారు. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయబోరని పేర్కొన్నారు. ప్రజల తర్వాతే.. తనను, కుటుంబాన్ని పట్టించుకునేవారని గుర్తు చేసుకున్నారు. రైతులకు తమ కుటుంబం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

భువనేశ్వరి విరాళంగా ఇచ్చిన గాజును చూపిస్తున్న చంద్రబాబు

చంద్రబాబు ధ్యాస ఎప్పుడూ అమరావతి మీదే అని.. ఆయన సతీమణి భువనేశ్వరి చెప్పారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్రం కోసం కష్టపడ్డారని గుర్తు చేశారు. రైతులు, మహిళలు పడుతున్న ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. వారి పోరాటానికి తనతో పాటు.. తన కుటుంబం అంతా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎర్రబాలెంలో రైతుల ఆందోళనకు తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా.. తన చేతికి ఉన్న రెండు గాజులను ఉద్యమం చేస్తున్న వారికి విరాళంగా ఇచ్చారు.

ఇదీ చూడండి:

కొత్త సంవత్సర వేళ రైతుల మధ్యే చంద్రబాబు

Last Updated : Jan 1, 2020, 4:58 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.