రాష్ట్ర రాజధాని అమరావతికి తెదేపా అధినేత చంద్రబాబు వందనం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో... ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి, నదీ జలాల చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించారు. అనంతరం.. ఇదే విషయాన్ని ట్విటర్ లో అనుచరులతో పంచుకున్నారు. గంగాయమునాదుల పవిత్ర జలంతో తడిసి, ఒక పవిత్ర సంకల్పానికి ఊపిరినిచ్చిన రాజధాని శంకుస్థాపన ప్రదేశమిది.. అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: