ETV Bharat / state

బెయిల్​పై రాజధాని రైతులు విడుదల

మీడియాపై దాడి కేసులో అరెస్టైన ఆరుగురు రాజధాని రైతులు... షరతులతో కూడిన బెయిల్​పై విడుదల అయ్యారు.  జిల్లా జైల్ ఆవరణ నుంచి లాడ్జ్ సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

capitals farmers  released
capitals farmers released
author img

By

Published : Dec 30, 2019, 8:47 PM IST

Updated : Dec 30, 2019, 9:25 PM IST

మీడియాపై దాడి కేసులో అరెస్టైన ఆరుగురు రాజధాని రైతులు.. షరతులతో కూడిన బెయిల్​పై విడుదల అయ్యారు. గుంటూరు జిల్లా జైల్ నుంచి విడుదలైన రైతులకు అమరావతి పరిరక్షణ సమితి, పొలిటికల్ జేఏసీ సభ్యులు, రైతులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జై అమరావతి... జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి రైతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పోరాటం ఆగేది లేదు: రాజధాని రైతులు

ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి భూములు ఇచ్చిన తమని పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారని వాపోయారు. రాజధానిని అమరావతిలొ కొనసాగించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తమ ప్రాణాలు అర్పించైనా రాజధానిని కాపాడుకుంటామని వివరించారు.

బెయిల్​పై రాజధాని రైతులు విడుదల

అనంతరం తెదేపా నేతలు మాట్లాడారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. రాజధాని కోసం పోరాటం చేసి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ రామకృష్ణ, రాజధాని రైతులు, జేఏసీ సభ్యులు తదితరులు రైతులకు స్వాగతం పలికారు.

ఇదీ చదవండి: 'ఈటీవీ భారత్​ రుణం ఇలా తీర్చుకున్నారు..!'

sample description
Last Updated : Dec 30, 2019, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.