పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో! - పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో!
తమపై పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ ...తుళ్లూరులో రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎండలోనే రహదారిపై రైతులు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ధర్నా శిబిరం ముందు రహదారిపై బైఠాయించి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పోలీసులు కొట్టిన దెబ్బలను చూపించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడం దారుణమని రైతులు మండిపడ్డారు.