ETV Bharat / state

జగన్​తో అజీం ప్రేమ్​జీ ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ

ఏపీలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వానికి సహకరిస్తామని అజీం ప్రేమ్​జీ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​కు చెప్పారు. సీఎం జగన్​తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.

జగన్​తో అజీం ప్రేమ్​జీ ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ
author img

By

Published : Jul 26, 2019, 6:49 PM IST

జగన్​తో అజీం ప్రేమ్​జీ ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ

రాష్ట్రంలో పెట్టుబడిరహిత ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని... అజీం ప్రేమ్​జీ ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి పలు అంశాల గురించి వివరించారు. రూ.100కోట్ల మేర ఆర్థిక సహకారాన్ని అందించేందుకు సిద్ధమని సీఎంకు తెలిపారు. దీనికి సంబంధించి సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు.

ప్రకృతి వ్యవసాయంపై సమర్ధవంతమైన విధి విధానాలు రూపకల్పన చేయాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఔత్సాహికులైన రైతులకు సేంద్రీయ ఎరువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నాణ్యమైన పురుగులమందులు, ఎరువులు రైతులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న సీఎం... నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాణ్యతా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించటంతో పాటు ధరల స్థిరీకరణ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదీ చదవండీ...

ఆగస్టు 1న సీఎం జగన్ జెరూసలేం పర్యటన

Intro:Ap_Vsp_91_26_Bjp_Purandeswari_On_Govt_Ab_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రజలు ఆలోచించుకోమని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.

Body:అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్ల ను గౌరవించాలని, అలాగే వారి కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని ఆమె కోరారు.

Conclusion:తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతిని భరించలేకే ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారని.. కానీ అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని..ప్రజలు ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నామన్నారు. గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడడం సరైనది కాదని, రైతు సంఘాలు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పి పి ఏ) అవినీతి జరిగితే సమీక్షించడం మంచిదేనని కానీ రద్దు నిర్ణయం సరైనది కాదని ఆమె అన్నారు. పి పి ఏ లపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా భాజపా జాయిన్ అయ్యేందుకు వచ్చిన పలువురు యువకులకు ఆమె కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, బీజేవైయం నాయకులు పాల్గొన్నారు.

బైట్: దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ కేంద్రమంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.