ETV Bharat / state

అత్తోటలో విత్తనాలు... పూర్వీకుల జ్ఞాపకాలు - story on athaota seeds

ఆ ఊరిలో రైతులు.. విత్తనం కోసం కంపెనీల మీద ఆధారపడరు. పంటకు సరిపడా విత్తనాలు వారే సమకూర్చుకుంటారు. అదీ మరుగున పడిపోయిన... పూర్వీకులు వాడిన విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో సేకరిస్తుంటారు. సంకర విత్తనాలతో మందుల కూడు ఇస్తున్న నేటి రైతుకు.. దేశీయ విత్తనాలు ఇవ్వడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇలా... గుంటూరు జిల్లా అత్తోట గ్రామస్థులు యజ్ఞంగా చేపట్టిన మన ఊరు- మన విత్తనంపై ఈటీవీ భారత్ కథనం.

athota regional seeds story
త్తోట విత్తనాలపై కథనం
author img

By

Published : Dec 16, 2019, 9:16 PM IST

త్తోట విత్తనాలపై కథనం

విత్తనం.... రైతు పండించే ఏ పంటకైనా మూలాధారం. విత్తనం ఎంత మంచిదైతే అంత దిగుబడి వస్తుంది. హరిత విప్లవం తర్వాత విత్తనాలు తయారు చేయడం మానేసిన రైతులు కంపెనీలపైనే ఆధారపడ్డారు. ప్రైవేటు కంపెనీలు రంగ ప్రవేశం చేసి సాగు మొత్తాన్ని గుప్పెట్లోకి తీసుకున్నాయి. రైతులు నష్టాల బారిన పడుతుంటే... ప్రజలు మందుల తిండే తింటున్నారు. ఇది గమనించిన గుంటూరు జిల్లా కొల్లిపార మండలం అత్తోట గ్రామ రైతులు... దేశీయ విత్తన యజ్ఞం చేపట్టారు. సేంద్రీయ పద్ధతిలో పండించి విత్తనాలు మనుగడలోకి తీసుకురావాలని తలచారు. మన ఊరు - మన విత్తనం నినాదంతో ముందుకు కదిలారు.

కొన్ని దశాబ్దాల క్రితం సాగు చేసిన విత్తనాలను మళ్లీ పుడమి తల్లి కడుపున చల్లి... విత్తనోత్పత్తి చేయాలని సంకల్పించారు అత్తోట గ్రామ రైతులు. ప్రభుత్వ ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు, విత్తన సేకరణ సంస్థలను ఆశ్రయించి 206 రకాల వరి వంగడాలు సేకరించారు. కొన్ని వరి రకాలైతే 10 గింజలు, 12 గింజలు మాత్రమే వచ్చాయి.

పండించిన తర్వాత సగం గింజలు వెనక్కి ఇవ్వాలన్న ప్రాతిపదికపైన జీవ వైవిధ్య సంస్థ వివిధ రకాలు అందజేసింది. సేకరించిన విత్తనాలు ఐదెకరాల విస్తీర్ణంలో 206 బ్లాకుల్లో సాగు చేశారు. అత్తోట ప్రకృతి విధాన జీవ వైవిధ్య క్షేత్రమని పేరు పెట్టి... పాలేకర్​ విధానంలో సాగు చేశారు.

అత్తోటలో సాగుచేసిన 206 రకాల్లో వేటికవే ప్రత్యేకమని చెప్పాలి. ఔషధ గుణాలున్నవి కొన్నైతే... ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని నిలబడేవి ఇంకొన్ని. ఎలాంటి చీడపీడలనైనా ఎదుర్కొనేవి మరికొన్ని. సువాసనలిచ్చే రకాలు, సన్న, లావు రకాలు సాగు చేశారు. పెట్టుబడి సగానికిపైగా తగ్గిపోయింది. వీటన్నిటి ఫలితంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం జీవ వైవిధ్య క్షేత్రంతో సరిపెట్టుకోకుండా.... ఎక్కువ విత్తనాలు అందుబాటులో ఉన్న రకాలను రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఇలా సాగు చేసిన దేశీవాళి రకాలకు మంచి డిమాండ్ ఉంది. పొరుగు గ్రామాల రైతులు వచ్చి విత్తనాలు తీసుకెళ్తున్నారు.

ఇదీ చదవండి

తండ్రి అప్పులకు తల్లడిల్లి... తనయుడి అద్భుతాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.