ETV Bharat / state

అమెరికాలో ప్రేమ... ఆంధ్రాలో పెళ్లి - ఆంధ్రా అమ్మాయి అమెరికా అమ్మాయి పెళ్లి

భాషలు వేరైనా వారిరువురి భావాలు ఒక్కటయ్యాయి. మతాలు కలవకపోయినా మనసులు కలిశాయి. పెద్దల అంగీకారంతో ఆంద్ర అమ్మాయి అమెరికా అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఇష్టంతో హిందూ సంప్రదాయంలో తన సొంతూరిలోనే తనకు నచ్చిన వాడిని అమ్మాయి వివాహం చేసుకుంది. అమెరికాలో వారి ప్రేమకథ ఇక్కడ వారి పెళ్లి విశేషాల గురించి మనమూ తెలుసుకుందామా..!

పెళ్లిచేసుకుంటున్న వధూవరులు
author img

By

Published : Nov 4, 2019, 9:35 AM IST

పెళ్లిచేసుకున్న ఆంధ్రా అమ్మాయి.. అమెరికా అబ్బాయి

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొడాలి పాపారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె లక్ష్మి.. ఆమె భర్త గోగినేని రవీంద్ర కుమార్ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రూప అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆఫ్రికన్ స్టడీస్ పూర్తి చేసుకుని.. జర్నలిజంపై మక్కువతో వైల్డ్ లైఫ్ జర్నలిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించింది. నైరోబి కేంద్రంగా ప్రముఖ ఛానెల్​లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే వైల్డ్ లైఫ్​లో ఫోటో జర్నలిస్ట్​గా పని చేస్తోన్న ట్రవర్​తో పరిచయం ఏర్పడింది. ఆరేళ్లుగా ఇద్దరు కలిసి ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో వారి ప్రేమను గౌరవిస్తూ వివాహం చేసేందుకు అంగీకరించారు.

హిందూ సంప్రదాయంలో పెళ్లి

ఇద్దరూ అమెరికా పౌరులు అయినప్పటికీ రూపకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిపై ఇష్టంతో పెళ్లి అమ్మ సొంత గ్రామమైన గూడవల్లిలోని తాతయ్య ఇంటి దగ్గర జరుపుకోవాలని ఆశతో వరుడిని ఒప్పించింది. అతను అందుకు అంగీకరించటంతో హిందూ ధర్మం ప్రకారం వారి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

సొంతూరంటే ఇష్టంతోనే

ఇప్పటికే తన ప్రియుడ ట్రైవర్​ను నాలుగు సార్లు గూడవల్లికి తీసుకువచ్చినట్లు రూప చెబుతోంది. అతను ఇక్కడి వాతావరణం బాగా ఇష్టపడతాడని తెలిపింది. దేశాలు వేరైనా.. మనసులు కలవటంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. అంతే కాకుండా తెలుగునేలపై మక్కువతో ఇక్కడే పెళ్లి చేసుకోవటం విశేషం.

ఇదీ చూడండి

పుట్టినరోజున షారుఖ్​కు గుర్తొచ్చిన కళాశాల రోజులు..

Intro:ap_gnt_46_03_andhra ammayi_amerika abbayi_mrge_pkg_ap10035

యాంకర్

భాషలు వేరైనా భావాలు ఒక్కటయ్యాయి..వారి మతాలు వేరైనా మనసులు కలిసాయి.ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఆ ఆంద్ర అమ్మాయి..అమెరికా అబ్బాయి.హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఎక్కడో కాదు గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి అనే గ్రామంలో జరిగింది.

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్. కొడాలి పాపారావు కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.పెద్ద కుమార్తె లక్ష్మీ భర్త గొగినెని రవీంద్ర కుమార్ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు.వారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రూప అమెరికలోనే పుట్టి పెరిగింది.ఆఫ్రికన్ స్టడీస్ పూర్తి చేసుకుని..జర్నలిజం పై మక్కువతో వైల్డ్ లైఫ్ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. నైరోబి కేంద్రంగా ప్రముఖ ఛానెల్ లో ఉద్యోగం విధులు నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే వైల్డ్ లైఫ్ లో ఫోటో జర్నలిస్ట్ గా పని చేస్తున్న ట్రవర్ తో పరిచయం ఏర్పడింది.ఆరేళ్లుగా ఇద్దరు కలిసి ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు.ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది.విషయం తల్లి దండ్రులకు చెప్పడంతో ప్రేమను గౌరవిస్తూ వారిద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు అంగీకరించారు.

అయితే ఇద్దరు అమెరికా పౌరులు అయినప్పటికీ రూపకు భారతీయ సాంప్రదాయాలు,సంస్కృతి పై ఇష్టంతో పెళ్లి అమ్మ సొంత గ్రామమైన గూడవల్లిలోని తాతయ్య ఇంటి దగ్గర జరుపుకోవాలని ఆశతో వరుడిని ఒప్పించింది. అయితే హిందు ధర్మము ప్రకారం పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవడంతో ఆదివారం ఎంతో వైభవంగా ఇద్దరి పెళ్లి వేడుక జరిగింది.తెలుగు సాంప్రదాయలంటే ఎంతో ఇష్టమని.. పల్లెటూర్లో ప్రకృతి అందాలను చూస్తున్నపుడల్లా సంతోషంగా ఉంటుందని... అంతకు ముందు నాలుగు సార్లు గ్రామానికి వచ్చానని వరుడు ట్రెవర్ తెలిపారు.భారతీయ సంప్రదాయం లో పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఆఫ్రికా దేశాలైన కెన్యా,సోమాలియా,నైరోబి,సుడాన్ దేశాల్లో జరుగుతున్న మానవ అక్రమ రవాణా పై అనేక డాక్యుమెంటరీ లు రూపొందించి ఐరాస ప్రశంసలు పొందారు.ఈ క్రమంలో ఆయా దేశాల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి అతివాద తీవ్రవాదుల నుంచి తప్పించుకుని కర్తవ్యాన్ని పూర్తి చేశారు.ఇలా ఇద్దరు కలిసి తమ వృత్తిలో రాణిస్తూ... స్వయంగా డాక్యుమెంటరీలు చేస్తూ ఎన్నో అమెరికా జాతీయస్థాయి పురస్కారాలను, అవార్డులు సొంతం చేసుకున్నారు.

Body:బైట్..రూప (వధువు)
ట్రెవర్ (వరుడు)
వెంకట కృష్ణ కుమార్ (వధువు మేన మామా,ప్రముఖ వైద్యుడు)

Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరాసాహెబ్ 7075757517
రేపల్లె, గుంటూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.