భాజపా, జనసేన పెద్దగా గుర్తింపు లేని పార్టీలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆ పార్టీలకు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు, సీట్లు వచ్చాయో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గుంటూరులో మాట్లాడిన ఆయన జనసేనానిపై విమర్శలు చేశారు. పవన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి అని అంబటి ఆరోపించారు. పవన్ ఏ పార్టీ కార్యాలయంలో కూర్చుంటారో ఆ పార్టీకి మద్దతిస్తారన్నారు. ఆనాడు పాచిపోయిన లడ్డూ అన్నారు.. ఇప్పుడు వాటిలో కిస్‌మిస్ కలిపి ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కలిశామని వ్యాఖ్యానించిన పవన్...భాజపాను ప్రత్యేక హోదా అడగాలన్నారు. పార్టీలు కలిసినా వైకాపాకు నష్టం లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కులతత్వం ఎక్కడ చూపించామో నిరూపించాలని నిలదీశారు.
ఇదీ చదవండి :