పేద ప్రజలకు అందాల్సిన రాయితీ సరకులను చౌక ధరల దుకాణాల ద్వారా... కొందరు అక్రమార్కులు నల్లబజారుకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో... తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులకు... క్వింటాళ్ల కొద్ది రాగులు పట్టుబడ్డాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండ, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, విశాఖ జిల్లాల నుంచి రాగులను గుంటూరుకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 3 రోజుల్లో రూ.53 లక్షల విలువైన రాగులు, జొన్నలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై 6ఏ తోపాటు... క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి: టన్నుల కొద్ది గంజాయి... ఎలా తరలిస్తున్నారో తెలుసా..?