టిక్‌టాక్ వీడియోలతో.. కొంత మంది ఫేమస్ అయిపోతుంటే.. మరి కొంతమంది బలైపోతున్నారు. తాజాగా తన స్నేహితుడే.. వీడియో చేసి పరువు తీశాడని ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోటికి చెందిన పుచ్చకాయల మోహన కుమార్(30) ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపించేవాడు. 2వేల దినార్లు అంటే నాలుగున్నర లక్షల రూపాయల చీటి పాడుకుని కనిపించకుండా పరారీలో ఉన్నాడని కుమార్‌పై తన స్నేహితుడు.. ఓ టిక్ టాక్ వీడియో క్రియేట్ చేశాడు. తనపై ఆరోపణలు చేస్తూ.. వీడియో చేయటంతో పరువు పోయిందని మోహన కుమార్ మనస్తాపం చెందాడు. కువైట్‌లోనే ఈ నెల మూడో తేదీన ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కువైట్ ఎంబసీ అధికారులతో భారత ఎంబసీ అధికారులు మాట్లాడి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఉపాధి కోసం వెళ్లిన తన కుమారుడు విగతజీవిగా తిరిగి రావటం కుటుంబాన్ని కలచివేసింది. వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: