ETV Bharat / state

పిల్లలకు భారమైనా... నేను కడదాకా కాపాడుకుంటా! - రాజమహేంద్రవరంలో భార్య భర్తల ఇబ్బందులు

కన్నపేగన్న మమకారం లేకుండా... కాదు పొమ్మన్నారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ భార్య ఆరోగ్యమే ముఖ్యమనుకుని సకల సపర్యలూ చేస్తున్నారు ఆ పెద్దాయన. వయసు మీదపడి తనకూ ఒంట్లో సత్తువ తగ్గినా... దాన్ని లెక్క చేయలేదు. సహధర్మచారిణిని సంతోషంగా చూసుకోవడమే ధ్యేయంగా అనుక్షణం తపిస్తున్నారు. ఉండేందుకు గూడు లేక ప్లాట్‌ఫాంనే తమ ఇంటిగా చేసుకుని... ఎవరో విశాల హృదయులు అందించే కొద్దిపాటి మెతుకులతోనే కడుపు నింపుకుంటోంది... ఆ వృద్ధ జంట. పింఛనూ సరిగ్గా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-November-2019/5210529_674_5210529_1575005140088.png

author img

By

Published : Nov 29, 2019, 11:28 AM IST

ఆదరణ కరవైంది..అన్నీ తానైంది

దశాబ్దాల క్రితమే వారి మధ్య చిగురించిన ప్రేమకు కులం, ప్రాంతం అడ్డు రాలేదు. ఆయనది తమిళనాడు... ఆమెది రాజమహేంద్రవరం. ఇన్నేళ్లూ అన్యోన్యంగా జీవించారు. రేయింబవళ్లు శ్రమించి ఇద్దరు పిల్లలను పెంచి ప్రయోజకులను చేశారు. 'అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా' అన్నట్టు రెక్కలు మొలవగానే వారు ఎగిరిపోయారు. పత్నిని పక్షవాతం నుంచి విముక్తురాలిని చేయాలన్న ధ్యేయమే శ్వాసగా ఒంటరిపోరాటం చేస్తున్నారు... నాగరాజు.

నాగరాజుకు... రాజమహేంద్రవరానికి చెందిన రమణమ్మకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. తాడితోటలోని ఓ అల్యూమినియం కంపెనీలో నాగరాజు పనిచేసేవారు. ఈ జంటకు ఓ కొడుకు, ఓ కుమార్తె. వారిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్న తరుణంలో... కష్టాల వలయం వీరిని చుట్టుముట్టింది. రమణమ్మకు పక్షవాతం వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక... అద్దె కట్టకపోవటంతో యజమానులూ ఇంటి నుంచీ వెళ్లగొట్టారు. భార్యకు సపర్యలు చేస్తూ రాజమహేంద్రవరం రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి కింద ప్లాట్‌ఫాంపైనే కాలం వెళ్లదీస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పక్షవాతంతో ఎన్ని అవస్థలు పడుతున్నా... తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తే తన దేవుడు అంటున్నారు... రమణమ్మ..వీరి దీన స్థితి తెలుసుకున్న స్థానికులు నిన్న రాత్రి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న తమకు మనసున్న మారాజులు ఎవరైనా సాయమందించాలని వీరు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

దేశం నలుమూలలా పేలుతున్న ఉల్లి బాంబులు

పిల్లలకు భారమైనా... నేను కడదాకా కాపాడుకుంటా!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.