తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమరావతి నుంచి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ముమ్మిడివరం మండలం గాడిలంకకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి ఐ.పోలవరం మండలం పశువుల్లంక వెళతారు. వృద్ధ గౌతమి గోదావరిపై నిర్మించిన వారధిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభాస్థలికి చేరుకుని... మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభిస్తారు. మత్స్యకారులకు జీఎస్పీసీ బకాయిల కింద చెల్లించాల్సిన 78 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కొమనాపల్లి బహిరంగ సభ ముగించుకొని 12 గంటలకు ముఖ్యమంత్రి జగన్ యానాం వెళ్లనున్నారు. పుదుచ్చేరి ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుని.... ఇటీవల మరణించిన ఆయన తండ్రి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
సీఎం పర్యటన సందర్భంగా అమలాపురం-కాకినాడ మార్గంలో పోలీసులు ట్రాఫింక్ ఆంక్షలు విధించారు. 4 చక్రాల వాహనాలను అంబాజీపేట, రావులపాలెం మీదుగా కాకినాడ వెళ్లేలా చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: