పలు దేవస్థానాలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను... కొందరు నకిలీ వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తున్నారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, ఇతర ఆలయాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ప్రముఖ ఆలయాల్లో పూజలు, ఇతర ఆన్లైన్ సేవలకు వేర్వేరుగా అధికారక వైబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పూజలకు ముందస్తు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. కొంతమంది నకిలీ వెబ్‌సైట్‌లను మనుగడలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు అన్నవరం దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి