చిన్నారి దీప్తిశ్రీని సవతితల్లి శాంతికుమారే హత్య చేసిందని తూర్పు గోదావరి ఎస్పీ నయీమ్ అస్మీ అన్నారు. చేసిన నేరాన్ని సవతితల్లి మొదట ఒప్పుకోలేదని... గట్టిగా అడిగేసరికి మొత్తం వివరాలు చెప్పిందని ఎస్పీ తెలిపారు. ఈ హత్య కేసులో ఇతరుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీప్తిశ్రీ కోసం 5 బృందాలుగా ఏర్పడి గాలించినట్లు తెలిపారు. నిందితురాలిపై అపహరణ, హత్య కేసులు పెట్టామన్నారు. కేసు విచారణలో సీసీ కెమెరా దృశ్యాలు చాలా సాయపడ్డాయని వివరించారు.
ఇదీ చదవండి