తూర్పు గోదావరి జిల్లా ప్రత్రిపాడు మండలం ధర్మవరంలో జాతీయ రహదారి పంటపొలాల్లో.. మూడు రోజులు పాటు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఒకేసారి 5 వందల కుటుంబాలు కలిసి వేడుక చేశారు. కొండేపూడి రవికిరణ్ తన పంట పొలంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసి.. బంధువులకు ఆహ్వానం పంపారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. జిల్లా స్థాయి న్యాయమూర్తులు న్యాయవాదులు, డాక్టర్లు ఉన్నత ఉద్యోగులు అనేక మంది ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. సంస్కృతి సంప్రదాయలకు విలువిచ్చారు. వస్త్రాలంకరణ, విద్యా విధానం, జీవన స్థితిగతుల పట్ల పిల్లలకు అవగాహన కల్పించారు. నేటి కాలంలో మానవ సంబంధాలు మనుగడ సాగించాలంటే ఇలాంటి వేడుకలు అవసరమని.. చాటి చెప్పారు. నృత్యాలు, పాటలు రాంప్ వాక్, ఉయ్యాల ఇలా..ఐక్యత రాగం స్నేహభావం పెంపొందేలా సందేశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి: