తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక, మూలస్థానం గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 160 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఈఎస్టీఎఫ్ టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. నాటు సారాను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ కె.సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి