ETV Bharat / state

చిత్రలేఖనంలో జాతీయ అవార్డులతో రామ్మోహనరావు...

చిత్రలేఖనంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. రెండేళ్లలో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఓ వైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తునే... మరోవైపు సామాజిక ఇతివృత్తాలతో చిత్రాలు గీస్తున్నారు. అందరి ప్రశంసలందుకుంటున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు.

చిత్రలేఖనంలో జాతీయ అవార్డులతో రామ్మోహనరావు...
author img

By

Published : Sep 5, 2019, 1:58 PM IST

చిత్రలేఖనంలో జాతీయ అవార్డులతో రామ్మోహనరావు...

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన రామ్మోహనరావు చిత్రలేఖనోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థులకు చిత్రలేఖనంలో మెళుకువలు నేర్పిస్తూనే... సామాజిక అంశాలపై చిత్రాలు వేస్తున్నారు. ఈయన వద్దే ఓనమాలు నేర్చుకున్న నలుగురు విద్యార్థులు 2017, 2018లో భగీరథ ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. మహానాయకుల చిత్రాలు గీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దేశ నాయకుల చిత్రాలు వేసి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులకు బహుమతిగా అందిస్తుంటారు. పలు ప్రాంతాల్లోని కమ్యూనిటీ భవనాల్లో ఉచితంగా చిత్రాలు వేస్తున్నారు.
చిత్రలేఖనంలో వచ్చిన అవార్డులు
చిత్రలేఖనంలో ప్రతిభ చూపుతూ జాతీయస్థాయి అవార్డులను రామ్మోహనరావు అందుకున్నారు. 2018లో చోడవరం చిత్రకళాపరిషత్తు... జాతీయ అవార్డు బహుకరించింది. చిత్రలేఖన పోటీల్లో విద్యార్ధులను బంగారు పతకాల సాధించేలా చేస్తున్న ఆయనకు 2019లో జాతీయ స్థాయి ప్రత్యేక అవార్డు వరించింది. ఇదే సంవత్సరం చెన్నైలో యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన కార్యక్రమంలో జ్యూరీ అవార్డు అందుకున్నారు. గుంటూరులో నిర్వహించిన అమరావతి ఫెస్టివల్‌లో రాష్ట్రస్థాయి ప్రత్యేక అవార్డు అందుకున్నారు. వివిధ అకాడమీలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని బహూకరించారు.

ఇదీ చదవండి:నేడు గురుపూజోత్సం..ఉపాధ్యాయులకు ప్రభుత్వ సన్మానం

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 8 4 3 9

AP_CDP_26_05_VILEENAMPAI_HARSHAM_AP10121

Body:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో కార్మికుల హర్షం వ్యక్తమైంది. ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . మిఠాయిలు పంచుకున్నారు మరో వైపు వైయస్సార్ మజ్దూర్ యూనియన్ నాయకుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు పద్మాకర్ పెట్టిన డిమాండ్ను నేడు జగన్ అమలు చేశారని యూనియన్ కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు

Byte: నాగరాజు, ఎంప్లాయిస్ యూనియన్, డిపో కార్యదర్శి, మైదుకూరు

Conclusion:Note: sir, వీడియో ఫైళ్లను ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.