ETV Bharat / state

కోనసీమలో కన్నులపండువగా ప్రభల తీర్థాల ఊరేగింపు - తూర్పుగోదావరి జిల్లాలో ప్రభల తీర్థాల ఊరేగింపు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా.. కనుమ సందర్భంగా ప్రభల తీర్థాలను ఊరేగించారు. 175 గ్రామాల్లో ప్రభల తీర్థాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కొత్తపేట మండలం ఆవిడి, రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో పలు ఆలయాలకు చెందిన కమిటీలు దేవతామూర్తుల అలంకరణ నిమిత్తం పెద్ద పెద్ద ప్రభలు తయారు చేశారు. పుష్పాలతో అందంగా అలంకరించి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను వాటిపై పెట్టారు. బాణసంచా డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. ఆయా గ్రామాలకు చెందిన దేవతామూర్తులను ప్రభలపై ఉంచి రెట్టించిన ఉత్సాహంతో యువత వాటిని భుజాన ఎత్తుకుని తరలించిన తీరు కనువిందు చేసింది. రాత్రి వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

prabhala theerthalu  carries on palanquin parade at east godavari
కోనసీమలో ప్రభల తీర్థాల ఊరేగింపు
author img

By

Published : Jan 16, 2020, 1:26 PM IST

కన్నులపండుగగా కోనసీమలో ప్రభల తీర్థాల ఊరేగింపు...

కన్నులపండుగగా కోనసీమలో ప్రభల తీర్థాల ఊరేగింపు...
..

ఇదీచూడండి.ప్రభల తీర్థంపై ప్రధాని స్పందన... ఉత్సాహంలో కోనసీమ యువత

Intro:యాంకర్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా సంక్రాంతి చివరి రోజు కనుమ నాడు నిర్వహించే ప్రభల తీర్థాలకు అందంగా అలంకరించిన prabalu ఊరేగింపుగా తీర్థ ప్రదేశాలకు తరలిస్తున్నారు ఇక్కడ సుమారు 175 గ్రామాలలో ప్రభలతీర్థాలు నిర్వహిస్తారు ఆయా గ్రామాలకు చెందిన దేవతామూర్తులను ప్రభలపై ఉంచి రెట్టించిన ఉత్సాహంతో యువత వాటిని భుజాన ఎత్తుకుని తరలిస్తున్న తీరు కనువిందు చేస్తుంది ఈరోజు రాత్రి వరకు ఉత్సవాలు కొనసాగుతాయ
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ప్రభల తీర్థాలు


Conclusion:కోనసీమలో ప్రభల తీర్థాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.