ETV Bharat / state

'రివర్స్‌ టెండరింగ్‌తో పనుల్లో జాప్యం తప్పదు' - పోలవరం

పోలవరం పనులు చేస్తున్న గుత్తేదారు నవయుగ పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ పేర్కొంది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్​లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది.

పోలవరం ప్రాజెక్టు
author img

By

Published : Aug 14, 2019, 6:25 AM IST

పోలవరం ప్రాజెక్టు

రాష్ట్ర ప్రజల జీవనాడీ పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై అథారిటీ స్పందించింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్​లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ మీడియాతో మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణం కూడా జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

పోలవరం పనులు చేస్తున్న గుత్తేదారు నవయుగ పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమన్న జైన్‌... పనుల్లో జాప్యం తప్పదని పేర్కొన్నారు. వ్యయం పెరిగితే కేంద్రం భరించబోదని స్పష్టం చేశారు. సుమారు 5గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది.

ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు తీరు... తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు... ప్రభుత్వం నోటీసు ఇవ్వడంపై చర్చించారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది.

ఇదీ చదవండీ...

వైకాపా ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు సూపర్ సెటైర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.