తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడియం మండలం సావరం గ్రామానికి చెందిన జ్యోతుల అర్జున్ మృతిచెందాడు. అర్జున్ మేన కోడలికి వివాహం కుదిరింది. మొదటి శుభలేఖను పెళ్లి కుమారుడుకి ఇచ్చేందుకు అర్జున్ పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లిలోని పెళ్లి కుమారుడి ఇంటికి ...జ్యోతుల వేణు, ఆదిలక్ష్మి, కర్రీ వీర్రాజులతో కలిసి ఆటోలో వెళ్లారు. జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి ఒక కారు వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికూతురి మేనమామ అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇదీచూడండి.రైల్వేగార్డ్ దురుసు ప్రవర్తన...రైల్లోనుంచి బాలుడి గెంటివేత