తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని నరేంద్రపురం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. 1997-98 సంవత్సరంలో పదో తరగతి చదవిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి... సంతోషంగా గడిపారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులందరిని సత్కరించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అప్పటి విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడి తిరిగి వచ్చేసరికి ... ఉపాధ్యాయులు మురిసిపోయారు. వారిని మనసార దీవించారు. 22 సంవత్సరాల తర్వాత ఒక్కటైన వీరంతా... ఆటపాటలతో కబుర్లు చెప్పుకుని... ఆనందంగా కలిసి భోజనం చేశారు. అనంతరం తమ పాఠశాల అభివృద్ధికి తోడ్పాడాలని నిర్ణయించుకున్నారు.
ఇవీ చదవండి