ఇవీ చూడండి:
'అవినీతిరహిత పాలన అని ఇసుక పంచాయితీ చేస్తారా..?' - nara lokesh on sand problems lates
తెదేపా హయాంలో కంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఇసుక ధర అధికంగా ఉందని తెదేపా నేత నారా లోకేశ్ ఉద్ఘాటించారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ డైరీ ఫాం సెంటర్లో ఇసుక కొరతతో ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
'అవినీతి రహిత పాలన అని ఇసుక పంచాయతీ చేస్తారా?'
కాకినాడ డైరీ ఫాం సెంటర్లో ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నీటి కొరత విన్నాం కాని ఇసుక కొరత మొట్టమొదటి సారిగా వింటున్నానని లోకేశ్ అన్నారు. ఇసుకపై ప్రభుత్వ విధానాలతో... 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ధర తెదేపా హయాంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. ఇసుక దందా జరుగుతోందంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎంకు ఉత్తరం రాశారని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత పాలన అని చెబుతూ... ముఖ్యమంత్రి ఇసుక పంచాయతీలు చేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులను ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:
Intro:Body:Conclusion:
Last Updated : Nov 5, 2019, 3:39 PM IST