రైతులు సంతృప్తి చెందేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆ శాఖ నూతన మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 62శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారని, వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని 'ఈటీవీ భారత్'కి చెప్పారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం అన్నదాత-సుఖీభవ ప్రభుత్వం తీసుకొచ్చిందని కానీ వారు ప్రకటించిన రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు వ్యవసాయ రంగాల అంశాలపై సిఫార్సులు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు కానుందన్నారు. మార్కెట్ లో నకిలీ విత్తనాలు, ఎరువులు, రసాయన మందుల విక్రయాలపై కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. నవరత్నాల్లో కీలక హామీగా ఉన్న రైతు భరోసాను ఏడాది ముందుగానే అక్టోబర్ 15నుంచి అమలు కానుందని తెలిపారు. దీనిపై మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు. వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాల పనితీరును సంతృప్తికర స్థాయిలో తీసుకొస్తామని పేర్కొన్నారు.
'ఓట్ల రాజకీయం చేయం.... రైతు సంతృప్తే లక్ష్యం' - agriculture
ఒకప్పుడు పాత్రికేయుడిగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన తొలిసారే మంత్రి వర్గంలోకి వచ్చారు. ఎంతో కీలకమైన వ్యవసాయ, సహకార శాఖలను దక్కించుకున్న కురసాల కన్నబాబు తొలిసారి ఈటీవీ భారత్తో ముచ్చటించారు. తనకిచ్చిన శాఖలకు పూర్తి న్యాయం చేసి రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.