ETV Bharat / state

ఎంటెక్‌ బాబు.... ప్రకటనలతోనే రూ.200కోట్లు టొకరా

డబ్బు కోసం ఆ ఎంటెక్​ బాబు అడ్డదార్లు తొక్కాడు. పత్రికల్లో ఉద్యోగ, రుణాల ప్రకటనలిచ్చి మరీ మోసం చేశాడు. ఆరు నెలలు శ్రమించిన ఈ కేటుగాడిని హైదరాబాద్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

ప్రకటనలతోనే రూ.200కోట్లు కొట్టేశాడు..
author img

By

Published : Oct 22, 2019, 9:17 PM IST

పేరు : మారుతి శ్రీనివాసరావు

స్వస్థలం: తుని, తూర్పుగోదావరి జిల్లా

చదువు: ఎంటెక్​

చేసే పని: సైబర్ నేరాలు

కేసులు:ఆంధ్రప్రదేశ్​లో- 17, తెలంగాణలో- 03,
12 జిల్లాల పోలీసులు గాలింపు

నేరం చేసే విధానం: ప్రధాన పత్రికల్లో ఉద్యోగాలు, రుణాలపేరుతో ప్రకటనలు

దోచేసిన సొమ్ము: రూ. 200 కోట్లు

మోసపోయిన వారి సంఖ్య: 150 మంది

ప్రకటనలతోనే రూ.200కోట్లు కొట్టేశాడు..

ఉద్యోగాలిప్పిస్తాం, అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తామంటూ ప్రధాన పత్రికల్లో ప్రకటలిచ్చి మరి మోసానికి పాల్పడ్డ సైబర్ నేరస్తుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు​ తుని ప్రాంతానికి చెందిన మారుతి శ్రీనివాసరావు ఎంతో మందిని మోసం చేశాడు. ఎంటెక్ చేసి సులభంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కాడు. ఉద్యోగాలు, రుణాలు ఇస్తామంటూ ప్రధాన పత్రికల్లో ప్రకటనలిచ్చి... డబ్బు డిమాండ్ చేసేవాడు మారుతి శ్రీనివాసరావు. ఇప్పటి వరకు ఈ నేరస్థుడిపై తెలంగాణలో 3 కేసులు ఉండగా... రాష్ట్రంలో 17 కేసులు ఉన్నాయి. ఇతని కోసం 12 జిల్లాల పోలీసులు గాలింపు చేపడుతున్నారు. గతంలో మాట్రిమోనీ సైట్ పేరుతో మోసాలు చేసి అరెస్టయ్యాడు. తర్వాత బెయిలుపై విడుదలై... 2017లో హైదరాబాద్​ వెళ్లిన శ్రీనివాసరావు అంబర్​పేటలో ఉంటూ సైబర్​ నేరాలకు పాల్పడ్డాడు. పత్రికల్లో ప్రకటనల ద్వారా 150 మంది నుంచి రూ.200 కోట్లు వసూలుకు పాల్పడ్డాడు. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్​లో ఏటీఎం కార్డు వివరాలు తీసుకుని డబ్బులు తస్కరించేవాడు. వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు అందుకున్న హైదరాబాద్‌ పోలీసులు... 6 నెలలు శ్రమించి శ్రీనివాసరావును పట్టుకున్నారు. నిందితుని కోసం 600లకు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలించారు.

ఇదీ చదవండి :

తాళాలు బద్దలుకొట్టారు... బంగారం దోచేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.