తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మద్దిరాల ధనరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆరు నెలలుగా ఇసుక కొరతతో పనుల్లేక.. అప్పులపాలై ఉరేసుకుని చనిపోయాడని బంధువులు తెలిపారు. మృతునికి ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. నెల రోజుల క్రితమే ధనరాజు భార్య వెంకటలక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. ఇంతలో ఈ విషాదం అయినందున అతని భార్యా పిల్లలు రోడ్డున పడ్డారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: