గంగపుత్రుల జీవితాలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం... మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నానని చెప్పారు. గంగపుత్రులు... చేపల వేట నిషేధ కాలంలో ఆదాయాన్ని కోల్పోతున్నారని... అందుకే ఆ సమయంలో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
మత్స్యకారులకు డీజిల్‌పై అందించే రాయితీని రూ.9కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. వేటకు వెళ్లి మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామని హామీఇచ్చారు. అంతకుముందు ఆయన పశువుల్లంక-సలాదివారిపాలెం వంతెనను ప్రారంభించారు. అక్కడి నుంచి బయల్దేరి కొమానపల్లి టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి