ఝార్ఖండ్ రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకీని... అన్నవరం పోలీసులు కనుగొన్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల బాలిక... ఈ నెల 22న కిడ్నాప్‌కు గురైనట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అపహరించినట్లు అనుమానించి... చరవాణి సిగ్నల్ ఆధారంగా అన్నవరం పరిసరాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడి అధికారులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మికి సమాచారం ఇవ్వగా... ఆయన అన్నవరం పోలీసులను అప్రమత్తం చేశారు. ఓ లాడ్జిలో బాలికను, అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఝార్ఖండ్ పోలీసులకు అప్పగించారు.
ఇదీచూడండి.సభాపతి రచించిన 'గాంధీ తాతకు జేజేలు' పుస్తకావిష్కరణ