తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బృహత్తర ప్రణాళికపై దేవస్థానం ఛైర్మన్ ఐ. వి. రోహిత్, ఈఓ త్రినాథరావు, అర్కిటెక్ట్లు చర్చించారు. వసతి సౌకర్యాలు మెరుగు పర్చడం, ట్రాఫిక్ నియంత్రణ, అన్నదాన భవన నిర్మాణం, పటిష్టమైన క్యూ లైన్లు, వ్రత మండపాలు, డార్మిటరీలు తదితర అన్ని అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: