అఖిల భారత అంగన్వాడీ 9వ మహా సభలు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభమయ్యాయి. సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాదిగా అంగన్వాడీలు, సుమారు 7 వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఐసీడీఎస్ విధానం ఎలా ప్రభావితం అవుతుందనే అంశాలపై చర్చించనున్నట్లు అంగన్వాడీ ఆలిండియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సింధు తెలిపారు. ఆరు నెలలుగా చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం సరిగా అందడం లేదని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా పడుతున్న కష్టాలపై చర్చించామన్నారు. మహా సభలు 20వ తేదీ వరకూ కొనసాగనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: