దారిద్య్రం ఆ అమ్మని ఒంటరిదాన్ని చేసింది. పిల్లలను పెద్ద చేసిపెళ్లిళ్లు చేసినా.. వారి బతుకులు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో వాళ్లని ఏమీ అడగలేదు... వారితో సంతోషంగా గడపలేదు. ఒంటరి జీవితంలో ఆమె పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కాదు. పూరిల్లు కూలిపోయి నిలువ నీడ లేక మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకొని జీవనం సాగిస్తోంది వృద్ధురాలు.
తూర్పుగోదావరి జిల్లా పి .గన్నవరం నియోజకవర్గంలోని జి .పెదపూడి గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరమ్మ అనే వృద్ధురాలు మరుగుదొడ్డిలోనే జీవితం వెళ్లదీస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా...ఒక కుమార్తె భర్త చనిపోయాడు. వారివి చాలీచాలనీ బతుకులే...ఇద్దరు కుమార్తెలు దూర ప్రాంతంలో దయనీయంగా జీవిస్తున్నారు. ఇక ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వీరమ్మ ఇల్లు కట్టుకునే స్థోమత లేక మరుగుదొడ్డిలోనే బతుకీడుస్తోంది.
తలదాచుకునేందుకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటోంది. దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
ఇదీచూడండి.పక్షులంటే రామలక్ష్మికి ప్రాణం... పొద్దుగాల్నే లేచి...