ఇదీ చదవండి:
65వ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు సర్వం సిద్ధం
65వ జాతీయ బాస్కెట్బాల్ అండర్ 19 ఛాంపియన్ షిప్ పోటీలకు యానాం సిద్ధమైంది. డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి.
జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి
కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు సర్వం సిద్ధమైంది. డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే 65వ జాతీయ బాస్కెట్బాల్ అండర్ 19 ఛాంపియన్ షిప్ పోటీలను పుదుచ్చేరి క్రీడల శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ క్రీడాకారులు ఆడేందుకు అనువైన వుడెన్ కోర్టులు.. ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు ఇతర హంగులు కల్పించారు. చమురు సంస్థలు రిలయన్స్, ఓఎన్జీసీ సహాకారంతో పుదుచ్చేరి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 40 మంది క్రీడాకారులు పాల్గోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి క్రీడల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీల ద్వారా అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. యానాంలో ఉన్న సౌకర్యాలు చూసి ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారని భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి క్రీడా పోటీలకు యానాం ఆతిథ్యమివ్వనుందని పుదుచ్చేరి క్రీడల శాఖ మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
Intro:Body:
Conclusion:
ap-rjy-37-25-national-games-avb-ap10019_25112019182031_2511f_0244
Conclusion: