ETV Bharat / state

చదివింది 7.. ఆవిష్కరణలు 30 - చిత్తూరు జిల్లా పలమనేరు ఆవిష్కర్త పవన్ న్యూస్

సమస్యలోస్తే.. కుంగిపోతావా? అంటే.. లేదు లేదు.. ఆవిష్కరణలు చేస్తా అంటాడీ యువకుడు. తన సమస్యలే.. తనకు ఆలోచనలు. తన పరిసరాలే.. పరిష్కారామార్గాలు. ఇంతకీ ఎవరా? యువకుడు. ఏం ఆవిష్కరణలు చేశాడు?

చదివింది 7.. ఆవిష్కరణలు 30
చదివింది 7.. ఆవిష్కరణలు 30
author img

By

Published : Dec 16, 2019, 9:51 PM IST

చదివింది 7.. ఆవిష్కరణలు 30

చుట్టూ సమస్యలే అయితే ఏం చేస్తాం. ఏంటో ఈ జీవితం అనుకుంటాం. ఎప్పటికి తీరునో అని దేవుడికి దండం పెడతాం. కానీ ఓ యువకుడు మాత్రం సమస్యల నుంచి దారులు కనుక్కున్నాడు. చదివింది ఏడో తరగతే అయినా.. ఆవిష్కర్తగా తయారయ్యాడు. 30 ఆవిష్కరణలు చేసి.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ చిన్న గ్రామం మొరం. ఆ గ్రామంలో పవన్ అనే యువకుడు ఏడో తరగతితో చదువు ఆపేసాడు. తర్వాత దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే తపన అతడిది. తన చుట్టూ ఉన్న సమస్యలు, తన స్నేహితులకు ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఆలోచించేవాడు. అలా ఇప్పటి వరకు సుమారు 30 ఆవిష్కరణలు చేశాడు పవన్. పలు అవార్డులు, రివార్డులు పొందాడు.

పవన్ ఆవిష్కరణలు గుర్తించిన యూఎస్ఏలోని బెర్కెలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. జీనియోస్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో సైతం పవన్ పేరు నమోదైంది. ఎక్కడ ఏ సమస్య చూసిన దానికి నేనెందుకు పరిష్కారం చూపకూడదు అనే ఆలోచనలే.. తన బలం అని చెప్తున్న పవన్.. కథ అతడి మాటల్లోనే..

ఇదీ చదవండి: తండ్రి అప్పులకు తల్లడిల్లి... తనయుడి అద్భుతాలు

Intro:ap_tpt_51_04_story_young_scientist_pawan_avb_ap10105.mp4

తన చుట్టూ సమస్యలే తనకు దారి చూపాయిBody:తన పరిసరాల్లోని సమస్యలే అతనిలో పరిష్కరమార్గాలు కనుక్కునేందుకు మార్గదర్శకాలయ్యాయి. చదివింది ఏడో తరగతే అయినా యువ శాస్త్రవేత్తగా తయారుచేశాయి. శాస్త్రవేత్త గా ఇప్పటివరకు సుమారు 30 ఆవిష్కరణలు చేసి పలు రికార్డులు నెలకొల్పాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్న అతని ఆవిష్కరణలు గుర్తించిన యూఎస్ఏలోని బెర్కెలీ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. జీనియోస్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో సైతం అతని పేరు నమోదైంది. ఇలా చిన్న వయసులోనే మారుమూల గ్రామం నుంచి ప్రపంచ ఖ్యాతి గడించిన యువకుడి స్ఫూర్తి దాయక కథనం ఇది.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఓ చిన్న గ్రామం మొరం. ఆ గ్రామంలో పవన్ అనే యువకుడు ఏడో తరగతిలో చదువు ఆపేసాడు తర్వాత డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసినా తన చుట్టూ ఉన్న సమస్యలు తన స్నేహితులు తన కుటుంబ సభ్యులకు ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా నడిపించి అతనిని ఒక ఆవిష్కరణ వేత్తగా తయారు చేశాయి. ఇప్పటి వరకు సుమారు 30 ఆవిష్కరణలు చేసిన అతను పలు అవార్డులు రివార్డులు పొందాడు. ఎక్కడ ఏ సమస్య చూసిన దానికి నేనెందుకు పరిష్కారం చూప కూడదు అనే ఆలోచనలే తన బలం అని చెప్తున్న ఆ యువకుడి వివరాలు అతని మాటల్లోనే విందాం....Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.