చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామా చల్లపల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన సాంబశివకు కొన్నేళ్ల క్రితం పుణ్యవతి అనే మహిళతో పెళ్లయింది. వివాహం అయిన కొన్ని నెలలకే ఆమె మృతి చెందింది. అనంతరం ఆమె చెల్లెలు రమణను సాంబశివ వివాహం చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా తన భార్యపై అనుమానం పెంచుకున్న సాంబశివ రోజూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే గత రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మేడపై పడుకున్న రమణను కర్రతో కొట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: