ఇదీ చదవండి: గోవిందా.. నీ డైరీలు ఎక్కడ? ఈ ఏడాదికి ఇంతేనా?!
అలిపిరి వద్ద కొత్త వసతి భవనాలు?
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి సముదాయాలను అలిపిరి సమీపంలో నిర్మించటానికి తితిదే సన్నాహాలు చేస్తోంది. భవన నిర్మాణానికి అనువైన స్థలం వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
అలిపిరి వద్ద కొత్త వసతి భవనాల నిర్మాణం?
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ కొండపైన తగ్గించేందుకు తితిదే సన్నాహాలు చేస్తోంది. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గే వరకూ కొండ కిందనే అలిపిరి వద్ద ఉంచేందుకు భవనాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలిపిరి వద్ద నిర్మించే భవనాల విషయంపై శనివారం జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: గోవిందా.. నీ డైరీలు ఎక్కడ? ఈ ఏడాదికి ఇంతేనా?!
REPORTER:V.NARAYANAPPA
CAMERA:SUDHAKAR
CENTER:TIRUPATI
FILE: AP_TPT_09_27_TTD_BOARD_MEETING_CURTAINRAISER_AVB_3038178
() తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఇవాళ (శనివారం) ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశేషపూజ, వసంతోత్సవం వంటి ఆర్జిత సేవలను నిలిపివేసే అంశంతో పాటు తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధికి నిధుల కేటాయింపు....నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ పేరుతో విద్యాసంస్థ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై శనివారం జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. నిత్య అభిషేకాలతో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి విగ్రహం క్షీణ దశకు చేరుతోందని...ఆర్జిత సేవలను కొన్నింటిని రద్దు చేయాలని అర్చకులు, ఆగమసలహా మండలి సభ్యులు ధర్మకర్తల మండలికి సిఫారసు చేశారు. ఆర్జిత సేవల రద్దును కోరుతూ ఆగమసలహా మండలి చేసిన సిఫారసుపై సమావేశంలో చర్చించనున్నారు. తితిదే నిఘా, భద్రతా విభాగంలో సెక్యూరిటి గార్డులు నియామకం, రెండు గ్రాముల బంగారు డాలర్లు పన్నెండు వేలు కొనుగోలు, కనుమ రహదారుల మరమ్మతుల కోసం 90 కోట్ల రూపాయలు, తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో మరమ్మత్తుల కోసం 14.5 కోట్ల రూపాయల కేటాయింపు పై నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్పిఎఫ్ పోలీసుల జీతాలు కోసం ప్రభుత్వానికి చెల్లించవలసిన 70 కోట్ల రూపాయల నిలిపివేత, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ బంగారు రథం తయారీ అనుమతులు, తితిదేలో గణాంక విభాగం ఏర్పాటు...35 పోస్టులు భర్తీ, ముంబాయిలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి అనుమతులు, తిరుపతిలోని శ్రీనివాస, పద్మావతి కళ్యాణమండపాలు ఏసిగా మార్పు చేసేందుకు అనుమతులు, తితిదే పరిధిలోని ఆలయాలను తీసుకోవాలన్న శాసన సభ్యుల సిఫార్సుల అంశం పై నిర్ణయంతీసుకోనున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి సముదాయాలను అలిపిరి సమీపంలో నిర్మించే అంశంపై చర్చించనున్నారు. ...BYTE
వై.వి.సుబ్బారెడ్డి, తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్.