తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తితిదే జేఈవో లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని తితిదే కేంద్రీయ ఆసుపత్రిలో స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పలు వైద్య శిబిరాలను జేఈవో పరిశీలించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని తితిదే ఉద్యోగులు...వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవి చదవండి...రంగురంగుల దుంపల రుచే వేరు....