రాజధాని అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పరసాల వీధి నుంచి గాంధీరోడ్డు మీదుగా నాలుగు కాళ్లమండపం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మూడు రాజధానులు వద్దు - ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధాని తరలింపు పై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
ఇవీ చదవండి...'కేంద్రం పెద్దల మద్దతుతోనే రాజధాని మార్పు'