ETV Bharat / state

తిరుమలలో భారీ రద్దీ.. టైమ్ స్లాట్ టోకెన్ల నిలిపివేత - crowd

వేసవి సెలవులు ముగుస్తున్నందున తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి వారిని దర్శించుకోవాలంటే 24 గంటల కంటే ఎక్కువగానే క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.

తిరుమల
author img

By

Published : Jun 8, 2019, 8:07 PM IST

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వైకుంఠం నుంచి రామ్‌బగీచా వసతి గృహం వరకు సర్వదర్శనం క్యూలైన్లు పెరిగాయి. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. ఇవాళ శ్రీవారిని 70,600 మంది భక్తులు దర్శించుకోగా... శ్రీవారి హుండీకి రూ.3.2 కోట్లు ఆదాయం లభించింది.

టైమ్​స్లాట్ టోకెన్లు జారీ నిలిపివేత

శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం దివ్యదర్శనం, సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీని తితిదే అధికారులు నిలిపివేశారు.

Amaravati (Andhra Pradesh), Jun 08 (ANI): A day after announcing five deputies in his cabinet, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy constituted his council of ministers, which included 25 legislators who were sworn-in by Governor ESL Narasimhan. The swearing-in of ministers came nine days after Reddy took oath as Andhra Pradesh Chief Minister after sweeping the state both in Assembly and Lok Sabha polls.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.