చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం ఎడంవారిపల్లె వద్ద మదనపల్లి డిపోకు చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. తిరుపతి నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులకు గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా నడిపిన కారణంగానే.. ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. టైర్ పంచర్ అయ్యి స్టీరింగ్ కంట్రోల్ కాకపోవటం వల్లే ఘటన జరిగిందని డ్రైవర్ చెప్పాడు.
ఇదీ చదవండి: