చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. పులిబండ వద్ద అధికారులకు 25 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను గమనించిన స్మగ్లర్లు దుంగలను అక్కడే వదిలేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వెంబడించిన అధికారులు తిరువన్నామలైకి చెందిన ఓ స్మగ్లర్ల్ని అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం సమీప ప్రాంతాల్లో అటవీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీచదవండి