తెదేపా చేసిన ప్రతి పనికీ వైకాపా వ్యతిరేకంగా వెళ్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. చిత్తూరు, తిరుపతి నియోజక వర్గ జనసేన నాయకులతో సమావేశంలో మాట్లాడిన ఆయన.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేస్తున్నారని ఒక్క ఏడు కొండలకే రంగులు వేయలేదని ఎద్దేవా చేశారు. తిరుమల సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం మన గుండె బలాన్ని భయ పెడుతోందని ఆరోపించారు. ఓట్ల రాజకీయాలు చేయని రోజు.. రైతులను ఇబ్బంది పెట్టని రోజునే ముఖ్యమంత్రి జగన్ను గౌరవిస్తానని అన్నారు.
దిశ ఘటన దారుణం
తెలంగాణలోని దిశ ఘటన దారుణమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను కాపాడలేకుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సత్వర శిక్షలు ఉన్నప్పుడే.. నిందితులు భయపడుతారని అన్నారు.
ఇదీ చూడండి:
'ఆంగ్ల మాధ్యమంలో చదివిన వ్యక్తులు జైలుకు ఎందుకు వెళ్లారు..?'