తిరుమల తిరుపతి దేవస్థానం నూతన దర్శన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు సమర్పించిన భక్తులకు వీఐపీ ప్రారంభ దర్శనం టిక్కెట్లను కేటాయిస్తోంది. కొత్త విధానాన్ని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమలలో ప్రారంభించారు. చెన్నైకి చెందిన నలుగురు భక్తులు మొదటగా టిక్కెట్లను పొంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు శ్రీవారిని మరింత చేరువ చేసేందుకు దీనిని అమల్లోకి తెచ్చినట్లు ధర్మారెడ్డి చెప్పారు. లక్షలోపు విరాళం ఇచ్చే భక్తులకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతానికి గోకులం జేఈవో క్యాంపు ఆఫీసులో దీనికి సంబంధించిన కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. మరో 15 రోజుల్లో మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు వివరించారు.
తిరుమలలో రూ.10 వేల విరాళానికి..వీఐపీ బ్రేక్ దర్శనం - తిరుమలలో నూతన పద్ధతి
సరికొత్త విధానానికి తితిదే శ్రీకారం చుట్టింది. శ్రీవాణి ట్రస్టుకు రూ. 10 వేలు విరాళమిచ్చిన భక్తులకు వీఐపీ ప్రారంభ దర్శనం కల్పిస్తోంది.