తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై తితిదే సమీక్ష - meeting by TTD about rathasapthami celebrations
తిరుమల అన్నమయ్యభవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సమావేశమైంది. రథసప్తమి పండుగ ఏర్పాట్లపై .. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్షించారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్ఠిలో ఉంచుకుని విసృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటి నుంచి రథసప్తమిని పురస్కరించుకుని అన్ని అర్జిత సేవలతో పాటు, ప్రత్యేక దర్శనాలను రద్దుచేసినట్లు ధర్మారెడ్డి తెలిపారు.