ETV Bharat / state

భూమి లేకుండా పంట.. ఎరువులు లేకుండా సాగు

ఆదిమ కాలం నుంచి మనిషి సాగిస్తున్న ప్రగతి పథంలో వ్యవసాయానిది కీలక పాత్ర. భూమిని చదును చేసి... పంట పండించటం నేర్చుకున్న నాటి నుంచి మానవాభివృద్ధి సాధ్యమైందని చరిత్రకారులు చెబుతుంటారు. సామాజికంగా, ఆర్థికంగా మనిషి ఎదుగుదలకు వ్యవసాయం ఓ కీలక భాగస్వామి. కానీ.. వాతావరణ పరిస్థితులతో పాటు అనేక సమస్యల ఫలితంగా కాడి భారమై.... హలం వదిలి రైతన్న దిగాలు పడుతున్నాడు. ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన ఓ విశ్వవిద్యాలయం.... సమస్యను పరిష్కరించేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది. పాఠాలు నేర్చుకునే దశ నుంచే విద్యార్థులకు అధునాతన సాగుపద్ధతులు నేర్పిస్తూ... భావితరాలకు మార్గనిర్దేశం చేసేలా కార్యాచరణ అమలు చేస్తోంది.

Hydroponics technique course in tiruapati venkateswara university
భూమి లేకుండా పంట.. ఎరువులు లేకుండా సాగు
author img

By

Published : Dec 18, 2019, 8:43 AM IST

భూమి లేకుండా పంట.. ఎరువులు లేకుండా సాగు

వ్యవసాయం.... దేశ ప్రాధ్యామాల్లో తొలిస్థానం కలిగి ఉంది. 50 శాతానికి పైగా దేశప్రజలకు ప్రధాన జీవన వనరు ఇదే. దేశ జీడీపీలో 18 శాతం వ్యవసాయానిదే అంటే ఆ ఆవశ్యకత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో భారతీయుల జీవితాల్లో ఓ సంస్కృతిలా అంతర్భాగమైంది వ్యవసాయం. పరుగులు పెడుతున్న ప్రపంచంతో సరిసమానంగా వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను... దేశీయ రైతాంగం అందిపుచ్చుకోవటంలో వెనుకబడిందన్నది కఠిన వాస్తవం. ఫలితంగా... రైతన్న ఎంత శ్రమించినా సరైన ఫలితాలు రాబట్టలేక దిగాలు పడుతున్నాడు.

ఆ ఒక్క చోటే కోర్సులు

సమస్య మూలాలను పసిగట్టి... వాటిని ప్రక్షాళన చేయాల్సిన ప్రభుత్వాలు రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా భావిస్తున్నాయే తప్ప సమగ్ర పరిష్కరాలు చూపలేకపోతున్నాయి. భావిపౌరులను తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రపంచంతో పోటీ పడాలనే కాంక్షతో వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నాయి. ప్రముఖ విజ్ఞాన సంస్థలైన 23 ఐఐటీలలో కేవలం ఒక్క ఐఐటీ ఖరగ్​పూర్​లో మాత్రమే వ్యవసాయ సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే ఈ రంగంపై ప్రభుత్వాలు చూపుతున్న ఉదాసీనత అర్థం చేసుకోవచ్చు.

సరికొత్త విధానంలో సాగు

వ్యవసాయ రంగ ఆధునిక పద్ధతులు భావి తరాలకు చేరువ చేసేందుకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నడుం బిగించింది. విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర విభాగంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు ఎందరో విద్యార్థులకు మార్గదర్శకాలు అందిస్తోంది. అత్యాధునిక సాగు పద్ధతుల్లో ఒకటైన హైడ్రోపోనిక్స్ ద్వారా సరికొత్త పద్ధతిలో మొక్కలను పెంచటంపై విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను అందిస్తూ...ఓ విన్నూత్న ప్రయోగానికి నాంది పలికింది.

పురుగు మందులు లేకుండా పంట

హైడ్రోపోనిక్స్.. భూమి అవసరం లేకుండా కేవలం నీటి ద్వారా మొక్కలను పెంచే ఆధునిక సాగు ప్రక్రియ. సాధారణ సాగులో ఖర్చయ్యే నీటి శాతంలో సగం కంటే తక్కువ నీటితోనే ఈ సాగు చేయవచ్చు. 21వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికతతో .. నీటి ద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూ ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా సాగుచేయవచ్చు.

విద్యార్థి టూ రైతు

ఈ విధానంపై దేశంలో గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. దేశవాళీ పంటలు, మిద్దె తోటలు, ఇంటికి అవసరమైన కూరగాయల పెంపకంలో హైడ్రోపోనిక్స్ విరివిగా ఉపయోగించుకోవచ్చని పరిశోధనల్లో వెల్లడయ్యాయి. క్షేత్రస్థాయిలో సాధారణ పంటలకంటే అతి తక్కువ మొత్తంలో నీటిని వినియోగించటం ద్వారా సాగు సాధ్యమయ్యే ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటాన్ని బాధ్యతగా చేపట్టింది తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం. వర్సిటీలో విద్యార్థి దశ నుంచే ఈ విధానంపై శిక్షణ, అవగాహన కల్పించటం ద్వారా భవిష్యత్​లో విభిన్న సాగు విధానాల ద్వారా వ్యవసాయ రంగాన్ని తిరిగి పురోభివృద్ధి పథంలో నడిపించాలనే కృత నిశ్చయంతో ప్రణాళికలు రచించింది.

నైపుణ్య పాఠ్యాంశాలు

వ్యవసాయానికి ఏ మాత్రం వీలులేని ప్రదేశాల్లో హైడ్రోపోనిక్స్ ద్వారా సాగు చేయవచ్చు. ఈ విధానంతో రైతన్నకు మేలు జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న హైడ్రోపోనిక్స్ విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఈ నూతన విధానంలో సాగు కోసం కావాల్సిన ప్రత్యేకమైన సామగ్రి, ఖనిజ పోషకాల వినియోగం, సమస్యలు అధిగమించాల్సిన నైపుణ్యాలు పాఠ్యాంశాలుగా పెట్టి విద్యార్థులకు సాగుపాఠాలు బోధిస్తున్నారు.

కొత్త కోర్సులు

కేవలం బోటనీ విద్యార్థులకే కాకుండా ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ ఈ కోర్సు అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన హైడ్రో పోనిక్స్ కోర్సు.. ఎంతో మంది విద్యార్థులను ఆధునిక సాగు పద్ధతులు అవలంబించే విద్యార్థులుగా తీర్చిదిద్దుతోంది. ప్రత్యేకించి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు తమంతట తామే సొంతంగా హైడ్రోపోనిక్స్ సాగు చేపట్టటం ద్వారా తమతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించగలుగుతున్నారు.

ప్రచార సంధానకర్తలు

ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు కొందరు విద్యార్థులు. వాస్తవానికి వర్సిటీ ఈ కోర్సును ప్రవేశపెట్టటం వెనకున్న లక్ష్యం సైతం అదే అంటున్నారు అధ్యాపకులు. కేవలం చిత్తూరు జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ఎందరో విద్యార్థులు హైడ్రోపోనిక్స్ కోర్సును అభ్యసిస్తూ తమ ప్రాంతాల్లో ఈ విధానంపై ప్రచారానికి సంధానకర్తలుగా పనిచేస్తున్నారు.

ఇవి పండించవచ్చు

హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా టమాటా, ముల్లంగి, దోస, లెట్యూస్ మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు. ఎటువంటి రసాయనాల వినియోగం లేకుండా... చీడపీడల ప్రసక్తి లేని స్వచ్ఛమైన హైడ్రోపోనిక్స్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. హైడ్రోపోనిక్స్ తర్వాతి తరమైన.. కేవలం గాలిలో తేమతో పెరిగే ఏరోపోనిక్స్ వంటి సాగు పద్ధతులపైనా అవగాహన కల్పిస్తున్నారు.

అన్నపూర్ణ... భారతావని

వ్యవసాయం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సమ్మిళితం చేస్తుంది. అటువంటి వ్యవసాయానికి ఆధునిక పద్ధతులు జోడిస్తే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చు. అన్నపూర్ణగా పేరొందిన భారతదేశాన్ని.. నామ సార్థక దేశంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వాలు, విద్యాకేంద్రాలు కలిసికట్టుగా కృషిచేయాల్సి సమయం ఆసన్నమైంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయ కృషిని శ్లాఘిస్తున్నారు.

ఇదీ చదవండి:

మిర్చి రైతుకు అండగా.. ఇంజినీరింగ్​ విద్యార్థుల పరికరాలు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.