కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని రెండు దేవాలయాలను తితిదే పరిధిలోకి తెస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, చిత్తూరు జిల్లా కందులవారిపల్లిలోని శేషాచల లింగేశ్వరస్వామి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణతోపాటు నిర్వహణ బాధ్యతలను తితిదే చేపట్టనుందని దేవాదాయశాఖ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి : వెంకటేశుని నివాసం... ప్లాస్టిక్ రహితం...