చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యుత్ కష్టాలు.. విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయి. 11 రోజులుగా వసతి గృహంలో విద్యుత్ లేక కటిక చీకట్లో నానా అవస్థలు పడుతున్నారు. 487 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహానికి రోజుకు ఒక ట్యాంకర్ నీరు మాత్రమే సరఫరా అవుతున్న కారణంగా పిల్లలు ఇప్పటికే స్నానాలు మానుకున్నారు. దోమల బారిన పడి విష జ్వరాలపాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారే తప్పా పట్టించుకోవటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. పదవ తరగతి విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తమ పిల్లల కష్టాలు చూడలేక తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
గురుకుల పాఠశాలకు.. 11 రోజులుగా నిలిచిన విద్యుత్ - బాలయోగి గురుకుల పాఠశాల
చిత్తూరు జిల్లా బాలయోగి గురుకుల పాఠశాలలో 11 రోజులుగా విద్యుత్ సరఫరా కావడం లేదు. విద్యార్థులు సరిగా చదువుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.