ETV Bharat / state

పంచాయతీ పురస్కారాల్లో ఏపీకి 14 అవార్డులు - national awards for ap panchayats

జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్​ 14 అవార్డులు గెలుచుకుంది. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలోని గ్రామాలతోపాటు మరికొన్ని మండలాలు, గ్రామాలకు అవార్డులు దక్కాయి. స్వాభిమాన్, స్వచ్చత, జీవనోపాధి అంశాల ఆధారంగా ఈ పురస్కారాలు అందించారు.

పంచాయతీ పురస్కారాల్లో ఏపీ సత్తా.. 14 అవార్డులు కైవసం
author img

By

Published : Oct 23, 2019, 9:38 PM IST

పంచాయతీ పురస్కారాల్లో ఏపీ సత్తా.. 14 అవార్డులు కైవసం
జాతీయ పంచాయతీ పురస్కారాలను దిల్లీ పూసా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదానం చేశారు. 2017-18 గణాంకాల ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు వివిధ విభాగాల్లో కేంద్ర పంచాయతీరాజ్​శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అవార్డులు అందజేశారు. వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ 14, తెలంగాణకు 9 పురస్కారాలు దక్కాయి. గ్రామాల్లో స్వాభిమాన్, స్వచ్ఛత, జీవనోపాధి వంటి అంశాలతోపాటు గ్రామాభివృద్ధిని పరిధిలోకి తీసుకొని ఈ అవార్డులు అందజేశారు. ప్రకాశం జిల్లా కోనంగి, శ్రీకాకుళం జిల్లా పొగిరి గ్రామాలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికారణ్ పురస్కారాన్ని దక్కించుకోగా... చిత్తూరు జిల్లాలోని కరకంబాడి గ్రామపంచాయతీకి వికాస్ యోజన అవార్డు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని రాజువారి చింతలపాలెం గ్రామానికి బాల్యమిత్ర పురస్కారం, శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మానికి నానాజీ దేశ్​ముఖ్ జాతీయ గౌరవ గ్రామపంచాయతీ అవార్డు దక్కింది. వీటితో పాటు మరో 4 మండలాలు, ఆరు గ్రామాలకు పురస్కారాలు లభించాయి.

ఇదీ చదవండి :

బండ్ల గణేశ్​ను ప్రశ్నిస్తున్న పోలీసులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.