ETV Bharat / state

' అప్పుడు రైతు భరోసా - ఇప్పుడు దగా భరోసా' - barosa

పాదయాత్రలో రైతు భరోసా కాస్తా... అధికారంలోకి వచ్చాక జగన్ దగా భరోసా అయ్యిందని ట్విట్టర్‌లో నారా లోకేశ్‌ విమర్శించారు. రైతులను నమ్మించి ఇప్పుడు దగా చేస్తున్నారని ఆరోపించారు.

lokesh
author img

By

Published : Jul 20, 2019, 9:17 AM IST

  • పాదయాత్రలో రైతుభరోసా కాస్తా అధికారంలోకి వచ్చాక @ysjagan గారి దగా భరోసా అయ్యింది. ఏటా పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే ఐదేళ్లకు రూ.62,500లు. ఇప్పుడు రూ.6,500లు మాత్రమే ఇస్తామని మాట మార్చారు. అంటే ఐదేళ్ళ సాయం రూ. 32,500లే అయ్యింది. pic.twitter.com/HpPVkAWQ2U

    — Lokesh Nara (@naralokesh) July 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ఒకే ఒక్క జే-టర్న్ తో ఒక్కో రైతుకు రూ.30,000ల దగా. రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది రైతులను మోసం చేసి ప్రభుత్వం మిగుల్చుకునేది రూ. 19,200 కోట్లు. వాహ్ సర్ జీ వాహ్!

    — Lokesh Nara (@naralokesh) July 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విట్టర్‌ వేదికగా అధికార పక్షంపై లోకేశ్‌ విమర్శలు కొనసాగుతున్నాయి. పాదయాత్రలో రైతుభరోసా అన్న జగన్‌... అధికారంలోకి వచ్చాక దగా భరోసా చేశారని తెదేపా జాతీయ కార్యదర్శి విమర్శించారు. ఏటా పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అంటే ఐదేళ్లకు 62,500లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పుడు 6,500 రూపాయలే ఇస్తామని మాట మార్చారని మండిపడ్డారు.

ఐదేళ్ళ సాయం ఇప్పుడు 32,500 లే అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఒక్క జే-టర్న్‌తో ఒక్కో రైతుకు 30,000ల రూపాయలు దగా చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది రైతులను మోసం చేసి ప్రభుత్వం మిగుల్చుకునేది 19,200 కోట్లు అని ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్క సంతకంతో 50వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసారని గుర్తు చేశారు. మిగిలిన రుణాలు దశలవారీగా మాఫీ చేస్తుంటే ... తమని నడిరోడ్డుమీద ఏదో చేయాలన్న జగన్‌ను ఇప్పుడేం చేయాలని ప్రశ్నించారు.

Intro:తాడేపల్లిగూడెం పట్టణంలోని నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దీన్ని సైన్స్ హబ్ గా రూపుదిద్దేందుకు విశ్వవిద్యాలయ అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సరికొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాదికి తాడేపల్లిగూడెం ప్రాంగణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే యోచనలో విశ్వవిద్యాలయ అధికారులు ఉన్నారు.
నన్నయ విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం ప్రాంగణం ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధంగా పని చేసేది. అప్పట్లో 300 పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకునే వారు. 2008వ సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు ఈ ప్రస్థానం కొనసాగింది. ఆ తరువాత నన్నయ విశ్వవిద్యాలయం గా మార్పు చెందింది. నన్నయ్య ప్రాంగణం ఏర్పడిన మొదటి ఏడాది ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంబీఏ, యోగా వంటి కోర్సులను నిర్వహించారు. యాగ కోర్సుకు విద్యార్థుల అంతగా రాకపోవడంతో దాన్ని నిలిపివేశారు. గూడెం ప్రాంగణాన్ని సైన్స్ హబ్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో ఎంబీఏ కోర్సును సైతం తొలగించారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అందుబాటులో ఉన్న కోర్సులు ఇవే
గూడెం ప్రాంగణంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి e3 పిజి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 30 సీట్లు ఉండగా ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీలలో పూర్తిస్థాయి గా సీట్లు నిండిపోయాయి. ఫిజిక్స్ మాత్రం 15 సీట్లు మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాదికి మరో రెండు పీజీ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదే తరహాలో నాలుగు కోర్సు లతో కూడిన ఇంజనీరింగ్ విద్యను కూడా అందించాలని విచ్చేస్తున్నారు. వచ్చే ఏడాదికి సివిల్, మెకానికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు కలిగిన ఇంజనీరింగ్ విద్య నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వచ్చే ఏడాది నుంచి దొరకనుంది.

సందిగ్ధంలో ఫార్మసీ కోర్సు
60 సీట్లు తో కూడిన ఫార్మసీ కోర్సును గూడెం ప్రాంగణంలో ప్రారంభించాలని నన్నయ విశ్వవిద్యాలయం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఫార్మసీ కోర్సుల సందిగ్ధంలో పడింది. ఒకవేళ ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచి ఫార్మసీ కోర్సు అందుబాటులో వస్తుంది. కౌన్సెలింగ్ ప్రారంభించే సమయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయనే ఆశతో అధికారులు ఉంటున్నారు.

Note: ఈ కథను ఈనాడు ఈ టీవీ కి చేయడం జరిగింది పరిశీలించగలరు

ఎం రాజశేఖర్, తాడేపల్లిగూడెం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ నెంబర్:9553161261Body:...Conclusion:...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.