ETV Bharat / state

స్మగ్లర్లకు చిక్కిన నత్తగుల్ల.. సరిహద్దులు దాటుతోందిలా..!

అరుదైన జీవజాలం ఉన్న కృష్ణా అభయారణ్యంలో అల్పజీవుల మనుగడ ప్రమాదంలో పడింది. కొన్ని అరుదైన నత్తలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది.ఇక్కడి నత్తలను కొందరు.. అక్రమమార్గంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటిస్తున్నారు. విదేశాల్లో వీటికి ఉన్న డిమాండ్​ను స్మగ్లర్లు సొమ్ముచేసుకుంటున్నారు. అటవీ... నిఘా అధికారులు పట్టింకుకోకపోవడంతో అరుదైన జీవ సంపద తరలిపోతోంది.

snails
author img

By

Published : Jul 18, 2019, 11:11 AM IST

Updated : Jul 18, 2019, 4:47 PM IST

స్మగ్లర్లకు చిక్కిన నత్తగుల్ల.. సరిహద్దులు దాటుతోందిలా..!

అమరావతి సమీపంలోని దివిసీమ అభయారణ్యంలో యథేచ్చగా అక్రమ దందా కొనసాగుతోంది. కొన్ని అరుదైన నత్తగుల్లలను.. ఇక్కడి నుంచి అక్రమమార్గాల్లో తరలిస్తున్నారు.

అరుదైన జీవజాలం....

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నదికి 2 వైపులా దాదాపు 194 చ.కి.మీ. పరిధిలో అడవి విస్తరించి ఉంది. ఇందులో పలు అరుదైన జంతు, జీవజాలం మనుగడ సాగిస్తోంది. ఆయిస్టర్‌, కరోనియా ట్రిటోనిస్‌, నాటిలిస్‌ పొంపిలియస్‌ వంటివాటిని వన్యప్రాణి సంరక్షణ చట్టంలో చేర్చారు. వీటితో పాటు.. ఇక్కడ మాత్రమే దొరికే బ్లడ్ కుకుల్స్​గా పిలిచే.. బుడతగుల్ల , టెజిల్లార్కా గ్రాసోనా ఉన్నాయి. ఇవి మనుగడ సాగిస్తున్నాయంటే అక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఉన్నట్లుగా పరిగణిస్తారు. నత్తలు నీటిలోని మలినాలను శుభ్రం చేస్తాయి. ఇక్కడ ఉన్న జీవజాలంలో నత్తగుల్లలు వేటకు గురవుతున్నాయి.

ఆ నత్తలకు డిమాండ్...

బుడతగుల్ల నత్తలలో హిమోగ్లోబిన్ ఎక్కువుగా ఉంటుంది. అలాగే పోషకాలు ఎక్కువే. వీటికి థాయ్​లాండ్, చైనా, మలేసియా దేశాల్లోని రెస్టారెంట్లలో మంచి డిమాండ్ ఉంది. దివిసీమలోని సాగరసంగమ ప్రాంతంలో బుడత గుల్లను సేకరించి ఉడికించిన మాంసం ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయం స్టానికులు, అటవీ అధికారులకు చెప్పినా స్పందన ఉండటం లేదు.

రోజుకు 10 టన్నులు...

దివిసీమలోని ఈలచెట్ల దిబ్బ, నాచుకుంట, ఎదురు మొండి, కోడూరు, హంసల దీవి, పాలకాయతిప్ప, ఎడ్లంక, తదితర ప్రాంతాల నుంచి నత్తల రవాణా సాగుతోంది. కూలీలను పడవల్లో అభయారణ్యంలోకి తీసుకెళ్లి... అక్కడ ఏరిన నత్తలను మడ అడవిలోని పాయల ద్వారా ఒడ్డుకు తెస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మినీ లారీలు, ఇతర వాహనాల్లోకి చేరుస్తారు. ఇందుకోసం కూలీలకు ఒక్కొక్కరికి కిలోకు రూ.50 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ సరుకును లారీలు, రైళ్వ ద్వారా చెన్నైకు చేరవేస్తున్నారు. అక్కడి ప్రధాన వ్యాపారులు వీరికి కిలోకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తారు. చెన్నై నుంచి డిమాండును బట్టి సముద్ర మార్గంలోగానీ, వాయు మార్గంలోగానీ విదేశాలకు రవాణా చేస్తారు. ఇలా ప్రతిరోజూ దాదాపు 10 టన్నుల మేర రవాణా చేస్తున్నారు.

అందరూ వాటాదార్లే..

వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కృష్ణా అభయారణ్యంలోని జీవులను తరలించడం నేరం. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అటవీ, పోలీసు సిబ్బంది విఫలమవుతున్నారు. స్మగ్లర్లు కొందరు కిందిస్థాయి సిబ్బందికి లంచాలిచ్చి తమ పని కానిస్తున్నారు. అభయారణ్యం బయట వీటి రవాణాను అరికట్టాల్సిన పోలీసుశాఖలోని కొందరిని స్మగ్లర్లు మచ్చిక చేసుకుని అక్రమ రవాణాకు అడ్డులేకుండా చూసుకుంటున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్‌ 9 కింద అక్రమంగా వేటాడటం, జీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చేయడం వంటి నేరాల కింద కేసులు పెట్టే అవకాశముంది. 5ఏళ్ల నుంచి 6ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు 5 కేసులే పెట్టారు. 3 పడవలను స్వాధీనం చేసుకున్నారు.

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం లో మక్కువ, పాచిపెంట సాలూరు యం డి వో ఆఫీస్ అదేవిధంగా సాలూరు పట్టణంలో లో మున్సిపల్ ఆఫీస్ వద్ద గ్రామ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు కు జరుగుతాయి ఈరోజు ఎండిఓ ఆఫీస్ లో ఐదు పంచాయతీల్లో నుండి 150 మంది గ్రామ వాలంటీర్లుగా అప్లై చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి

Body:j

Conclusion:h
Last Updated : Jul 18, 2019, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.